అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుని అరెస్ట్
NEWS Aug 28,2024 04:05 pm
నిర్మల్ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యున్ని అరెస్టు చేసినట్లు నిర్మల్ డిఎస్పీ గంగారెడ్డి తెలిపారు. పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. హరియాణాకు చెందిన మహమ్మద్ అబ్బాస్ 15 ఏళ్ల క్రితం నిర్మల్ కు వచ్చి ఉదయం పూట కూరగాయల దుకాణంలో పనిచేస్తున్నాడు.ఈ క్రమంలో జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడడంతో అతణ్ని పట్టుకుని 150 గ్రాముల గంజాయి, 2 తులాల బంగారం, 20 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.