పూల వ్యర్థాల నుంచి అదనపు ఆదాయం పొందాలి: కలెక్టర్
NEWS Aug 29,2024 12:35 pm
పూల వ్యర్థాల నుంచి అదనపు ఆదాయాన్ని పొందడంతోపాటు, పర్యావరణ కాలుష్యాన్ని నివారించడం సాధ్యం అవుతుందని తూ.గో జిల్లా కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద కడియం పూల మార్కెట్ అసోసియేషన్ ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. హోల్‌సేల్ పూల మార్కెట్ నిర్వాహకులు ఇరిగేషన్ కాలువల పూల వ్యర్థాలను వేయడం ద్వారా పరోక్షంగా పర్యావరణ కాలుష్యానికి కారణం అవుతున్నారన్నారు.