పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాల నివారణకు జిల్లా స్థాయి భద్రత పర్యవేక్షణ కమిటీ సభ్యులు చురుకైన పాత్ర పోషించాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టర్ ఛాంబర్‌లో పరిశ్రమల భద్రతపై సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగిన తర్వాత నివారణ చర్యలు చేపట్టడం కంటే ముందస్తుగానే ప్రమాదాల స్థాయిని గుర్తించి వాటి నివారణ కోసం తగిన చర్యలు తీసుకోవాలన్నారు.