నిర్మల్ జిల్లా కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు. నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. సోమవారం బస్టాండ్ వద్ద ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. పట్టణానికి చెందిన షేక్ అమెర్ సోహెల్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తున్న క్రమంలో అతని వద్ద తనిఖీ చేయగా 180 గ్రాముల గంజాయి పట్టుబడ్డట్లు తెలిపారు. ఈ మేరకు నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.