జిల్లాలో యానిమేటర్లను రాజకీయ కారణాలతో తొలగించడానికి ఆపాలని బకాయి పెట్టిన 6 నెలల వేతనాలు తక్షణం చెల్లించాలని కోరుతూ సెప్టెంబరు 2 నుంచి డీఆర్డీఏ ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామని యానిమేటర్ల సంఘ నాయకులు తెలిపారు. సీఐటీయూ అనుబంధ ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం కాకినాడలో ధర్నా నిర్వహించి డిఆర్డీఏ సూపరింటెండెండ్‌కి వినతిపత్రం అందించారు.