ఎమ్మెల్సీ కవిత ఈ సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఆమెకు BRS శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, హరీశ్ రావు, జోగినపల్లి సంతోష్, ఇతర కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఉన్నారు. కవిత ఎంతో ఉత్సాహంగా ఎయిర్ పోర్టు నుంచి వెలుపలికి వచ్చారు. కవిత హైదరాబాద్ నుంచి కేసీఆర్ ఫాంహౌస్ కు వెళ్ళినట్టు తెలుస్తోంది.