వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు మంచి సేవలు అందించాలని పెద్దాపురం వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ దేవకుమార్ కోరారు. మండలంలోని కట్టమూరు రైతు సేవ కేంద్రంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. వ్యవసాయ ఉద్యాన పంటల్లో ఉండే చీడపీడలను గుర్తించి వాటిని ఫొటోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేయాలన్నారు. ఏయే గ్రామాల్లో చీడపీడల ఉద్ధృతి ఉందనే విషయాన్ని గుర్తించి వ్యవసాయ శాఖ సేవల ద్వారా వాటి నిర్మూలనకు కృషి చేయాలన్నారు.