సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా
NEWS Aug 28,2024 01:23 pm
మధ్యాహ్న భోజన పథకం కార్మికులను, శానిటేషన్ వర్కర్లను అక్రమంగా తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఎంఈవో ఆఫీసు వద్ద సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మండల కన్వీనర్ విత్తనాల రాంబాబు, కో కన్వీనర్ విప్పర్తి మోహనరావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని, గత ప్రభుత్వం చేసిన పొరపాట్లను కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు.