తాపేశ్వరం సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు అభినందనీయులని రాజమహేంద్రవరం పోస్టల్ సూపరింటెండెంట్ కె.శేషారావు అన్నారు. తాపేశ్వరం సురుచి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రమాద బీమా పాలసీల ప్రత్యేక క్యాంప్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పోస్టల్ డిపార్ట్మెంట్ వారి ప్రమాద బీమా పాలసీలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.