కుమార్తెను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించిన జిల్లా కలెక్టర్
NEWS Aug 28,2024 01:23 pm
ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే తన కుమార్తెను జిల్లా కేంద్రంలోని అంగన్వాడీ ప్రీ స్కూల్లో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. కలెక్టర్ కూతురు స్వర అక్కడి పిల్లలతో కలిసి బొమ్మలకు రంగులు దిద్దుకుంటూ, ఆట వస్తువులతో ఆడుకుంటూ సరదాగా కనిపించింది.స్వతహాగా కలెక్టర్ ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. ఐతే కలెక్టర్ కూతురు తమ అంగన్వాడీలో చేరడం గర్వంగా ఉందని అంగన్వాడీ కేంద్రం సిబ్బంది తెలిపారు.