గంజాయి స్వాధీనం.. 9 మంది అరెస్టు
NEWS Aug 28,2024 01:32 pm
చింతూరు మండలం మోతుగూడెం చెక్ పోస్ట్ వద్ద 9మందిని అరెస్టు చేసి 265కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని ఎఎస్పీ పంకజ్ కుమార్ మీనా బుధవారం తెలిపారు. ఒడిశా నుంచి మహారాష్ట్ర, తెలంగాణకు కారు, బైక్స్‌పై గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. పట్టుబడిన గంజాయి విలువ దాదాపు రూ. 13.50 లక్షలు ఉంటుందన్నారు.