చోరీ కేసులో నలుగురి అరెస్ట్
NEWS Aug 28,2024 01:24 pm
చోరీ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్ఐ విష్ణువర్ధన్ తెలిపారు. ఆదిలాబాద్ లోని కే.ఆర్.కే కాలనీలో నివాసం ఉండే పెన్నేశ్వరి ఇంట్లో ఇటీవల చోరీ జరిగింది. దీంతో ఆమె మావల పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఐదుగురు యువకులు చోరీ చేసినట్లు గుర్తించామన్నారు. వీరిలో అర్బాజ్, షెహబాజ్, సోహెల్, వాజిద్ లను అరెస్టు చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు అశోక్ కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.