భార్య మరణం తట్టుకోలేక అదే రోజు భర్త మృతి
NEWS Aug 28,2024 01:24 pm
భార్య చనిపోయిన అదే రోజు భర్త మృతి చెందిన ఘటన తానూర్ మండలంలో చోటుచేసుకుంది. తానూర్ మండల కేంద్రానికి చెందిన బండేవార్ పోశెట్టి (91), పెంటుబాయి (86) దంపతులు కాగా పెంటుబాయి తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందింది.ఐతే భార్య అంత్యక్రియలు మధ్యాహ్నం జరగగా అదే రోజు రాత్రి 10గంటలకు మనోవేదనతో ఆమె భర్త పోశెట్టి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.ఒకే రోజు భార్య భర్తల మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.