అక్రమ లే అవుట్‌లపై విచారణ జరిపించాలని కలెక్టర్‌కు ఫిర్యాదు
NEWS Aug 28,2024 05:55 pm
కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో అక్రమ లే అవుట్‌లపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర TNTUC ఉపాధ్యక్షులు సబ్బతి ఫణిశ్వరరావు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామంలో విచ్చలవిడిగా అక్రమ లే అవుట్‌లు వేయడంతో వాటిని కొనుగోలు చేసిన ప్రజలు నష్టపోతున్నారు. అటు ప్రభుత్వ ఆదాయానికి కూడా భారీగా గండిపడుతుందన్నారు.