కంచికచర్ల పట్టణ పరిధిలోని చెవిటికల్లు గ్రామం వెళ్లే రహదారి ప్రక్కన కూరగాయలు కొనేందుకు వ్యక్తి వెళ్ళగా, ముగ్గురు అపరిచిత వ్యక్తులు అక్కడికి వచ్చి కూరగాయలు కొనుగోలు చేస్తున్న వ్యక్తి జేబులో నుంచి 4 వేల రూపాయలు తస్కరించిన విధానం సీసీ ఫుటేజ్ లో రికార్డు అయింది. సదరు వ్యక్తి ఇంటికి వెళ్లి చూసుకోగా నగదు కనిపించకపోవడంతో షాపు వద్ద వచ్చి సిసి రికార్డ్ పరిశీలించాడు. పోలీసులు ఇటువంటి దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలుకోరుతున్నారు.