బూర్జ మండలం వైకుంఠపురం పంచాయతీ పరిధిలోని అల్లిపల్లి గూడను సందర్శించిన రాష్ట్ర ఎస్టీ కమీషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్. అల్లిపల్లి ప్రజలు విన్నపం మేరకు విచ్చేసిన ఆయన గిరిజనులు సమస్యలును తెలుసుకున్నారు, గిరిజనులు ఎదుర్కొంటున్న సవాళ్లను విశిదీకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆదివాసీ పరిషత్ అధ్యక్షులు వాబా యోగి, మండల ఆదివాసీ సభ్యులు,సర్పంచ్ బీ వెంకట సత్యం,మండల అధికారులు, పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు.