దేవీపట్నం మండలంలో ఇప్పటి వరకు 3,300ఎకరాల్లో వారినాట్లు పడ్డాయని అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రశాంతి తెలిపారు. మండలంలో పొలాలను వ్యవసాయ శాఖ సిబ్బంది పరిశీలించారు. ప్రతీ రైతు తప్పనిసరిగా సరిగా ఈ క్రాప్ చేయించుకోవాలని సూచించారు. ఈ క్రాప్ ద్వారా పంటకు బీమా సదుపాయాలు, విక్రయాలు నమోదు సులభం అవుతుందన్నారు. మరో 700 ఎకరాల్లో నాట్లు వేయవలసి ఉందన్నారు.