దుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే నల్లమిల్లి దంపతులు
NEWS Aug 28,2024 09:22 am
అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు విజయవాడలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఎమ్మెల్యే నల్లమిల్లికి సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే నల్లమిల్లి పుట్టినరోజు కావడంతో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మ దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.