దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని కోరుతూ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నుంచి కోల్‌కతలోని భద్రకాళీ అమ్మ వారి ఆలయం వరకు యువకులు పాదయాత్ర చేపట్టారు. ఈ 21న విజయవాడలో ఈ యాత్ర ప్రారంభం కాగా బుధవారం మండపేట మండలంలోని ద్వారపూడికి చేరుకున్నారు. మండపేట నియోజకవర్గ బీజేపీ కో కన్వీనర్ కంకటాల మురళీకృష్ణ వీరికి స్వాగతం పలికి మద్దతు తెలిపారు.