NZB: నిజామాబాద్ లోని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ గా శివప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. వైస్ ప్రిన్సిపాల్ నాగమోహన్ నుంచి చార్జి తీసుకున్నారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ మెడికల్ కళాశాలను ఉత్తమంగా తీర్చిదిద్దేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కాగా ఇక్కడ ప్రిన్సిపాల్ గా పనిచేసిన డా. ఇందిరా ఇటీవల జరిగిన బదిలీల్లో గాంధీ కళాశాల ప్రిన్సిపల్ గా వెళ్ళిన సంగతి తెలిసిందే.