ఆమరణ నిరాహార దీక్ష 4వ రోజు
NEWS Aug 28,2024 07:27 am
HYD: సమగ్ర కుల జనగణన, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా బత్తుల సిద్దేశ్వరులు, సంజీవ్ నేతల ఆమరణ నిరాహార దీక్ష 4వ రోజు కొనసాగుతోంది. దీక్ష చేస్తున్న వారిని నిన్న దుండిగల్ నుంచి గాంధీ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అస్పత్రిలోను కొనసాగిస్తున్న ఆమరణ దీక్షతో వారి ఆరోగ్యం క్షీణిస్తోంది. వారిని గాంధీ ఆసుపత్రిలో బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారామ్ యాదవ్ పరామర్శించి సంఘీభావం తెలిపారు.