అయినవిల్లి మండలంలోని పోతుకర్రు గ్రామంలో మురుగు కాలువ వంతెన ప్రమాదకరంగా మారిందని ఇరువైపుల రక్షణ గోడలు పడిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ వంతెన పై భారీ వాహనాలు వెళ్లడంతో ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందని గ్రామస్థులు భయపడుతున్నారు. ఎన్నో మార్లు సంబంధించిన అధికారులు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.