రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ
NEWS Aug 28,2024 01:35 pm
ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పెదపూడిలో 30 పడకల సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక టీడీపీ కన్వీనర్ పుట్ట గంగాధర్ చౌదరి, జిల్లా నేత ఆరిమిల్లి అమ్మన్న చౌదరి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఆసుపత్రి సూపర్డెంట్ రమణమూర్తి, నేతలు వెదుళ్ల సతీష్, సత్తిబాబు, పాల్గొన్నారు.