జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదులో కొత్తపేట నియోజకవర్గం రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందటంలో వాలంటీర్లు పాత్రే కీలకమని నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బండారు శ్రీనివాస్ అన్నారు. నియోజకవర్గంలో 25వేలకు పైగా క్రియాశీల సభ్యత్వాల నమోదు కావడంతో పార్టీ అధినేత పవన్కళ్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలపాలన్నారు. సభ్యత్వ నమోదులో కీలక పాత్ర పోషించిన వాలంటీర్లను మంగళవారం ఆత్రేయపురంలో ఘనంగా సత్కరించారు.