సామర్లకోట భీమేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 29న పండిత సన్మాన సభ నిర్వహిస్తున్నట్లు బాలాత్రిపుర సుందరి వేదశాస్త్ర పరిషత్ కన్వీనర్ గ్రంథి సత్యరామకృష్ణ తెలిపారు. ఏటా నిర్వహించినట్లే వేదశాస్త్రాల పండిత సన్మాన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 8 గంటలకు వేద పఠనంతో సభ ప్రారంభమవుతుందన్నారు. పండితులు కార్యక్రమానికి హాజరై సత్కారాలు పొందాలని కోరారు.