డెంగ్యూ బాధితులకు పరామర్శ
NEWS Aug 28,2024 01:39 pm
పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం చింతనలంక గ్రామ పరిధిలో డెంగ్యూ వ్యాధికి గురైన బాధితులను స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, ఎంపీ గంటి హరీష్ మదుర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ మెరుగైన వైద్యం అందించాలని, వైద్య సిబ్బంది ప్రజలకి అందుబాటులో ఉండాలని వైద్య అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.