ఏపీ మంత్రి వర్గ సమావేశం కొనసాగుతోంది. చంద్రబాబు అధ్యక్షతన ఈసారి మంత్రి వర్గ సమావేశం పేపర్ లెస్‌తో నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు మంత్రులకు నోట్ అందజేసి నిర్వహించేవారు. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా ఈ - క్యాబినెట్ నిర్వహిస్తున్నారు. సమావేశంలో అజెండా మొదలుకుని నోట్స్ వరకు ఈ-ట్యాబ్‌లో మంత్రులకు అందజేయనున్నారు. 2014 -19 వరకు టీడీపీ హయాంలో ఈ - కేబినెట్ సమావేశాలను నిర్వహించిన విషయం తెలిసిందే.