వినాయక చవితి ఉత్సవ మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో సిస్టంతో రాజమండ్రి అర్బన్ పరిధిలో కార్పొరేషన్ కార్యాలయం నుంచి అలాగే రాజమండ్రి రూరల్ పరిధిలో తహసీల్దార్ కార్యాలయం నుంచి మండపాల ఏర్పాటుకు అనుమతులు తీసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కుమార్ తెలియజేశారు. నియమ నిబంధనలను ఆయా మండపాల కమిటీలు తప్పక పాటించాలని తెలిపారు.