కిల్లగూడలో పర్యటించిన అరకు ఎమ్మెల్యే
NEWS Aug 28,2024 06:08 am
డుంబ్రిగుడ మండలం కిల్లోగూడ ప్రభుత్వ ఆసుపత్రి మరియు పాఠశాలలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో డైనింగ్ హాల్, సోషల్ టీచర్ నియమించాలని కోరగా ఈ విషయంపై పాడేరు ఐటీడీఏ అధికారులతో చర్చించి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. అనంతరం PHC కి సందర్శించి సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని వైద్యులకు ఆదేశించారు.