ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి
NEWS Aug 28,2024 06:13 am
జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలకు అనుమతులు సింగిల్ విండో ద్వారా ఇస్తున్నట్టు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. కలెక్టరేట్‌లో జరిగిన వినాయక చవితి ఉత్సవాల అనుమతులు, ముందస్తు చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వినాయక చవితి పండుగను జాగ్రత్తలతో నిర్వహించే క్రమంలో మునిసిపల్, మండల స్ధాయిలో అనుబంధ శాఖలతో ఈ నెల 30వ తేదీలోగా సమావేశం నిర్వహించి మార్గదర్శకాలు సిద్ధం చేయాలన్నారు.