2 రోజులు ఉచిత క్యాన్సర్ పరీక్షలు
NEWS Aug 28,2024 06:10 am
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 31, వచ్చేనెల 1న ఉచిత మెగా వైద్య శిబిరం, క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జనసేన నాయకుడు నల్లా శ్రీధర్ తెలిపారు. స్థానిక గడియార స్తంభం ప్రాంగణంలో జనసేన నాయకుల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.