మామిడికుదురు మండల రెవెన్యూ అధికారిగా శ్రీదేవిని నియమిస్తూ 3 వారాల క్రితం ఆదేశాలు వెలువడ్డాయి. కానీ ఆమె ఇంతవరకు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు. ప్రధానంగా డిజిటల్ సైన్ విభాగంలో సమస్యలు ఏర్పడుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. డిప్యూటీ తహశీల్దార్ శరణ్యకు ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించిన కొన్ని పనులు పెండింగ్ లోనే ఉండిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.