బార్ అండ్ రెస్టారెంట్లో చోరీ
NEWS Aug 28,2024 06:10 am
నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ కాలనీలో గల సాయి వైష్ణవి బార్ అండ్ రెస్టారెంట్లో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. బార్ షట్టర్ పగలగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి కౌంటర్ లోని రూ. 30వేల నగదు, రూ.3వేల విలువైన మద్యం అపహరించినట్లు బార్ యజమాని తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.