ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని సాలెగూడ శివారులో గిరిజన రైతులు పండిస్తున్న గంజాయి పంటను పోలీసులు గుర్తించారు. గ్రామానికి చెందిన నైతం జ్యోతిరామ్, నైతం మంతులు తమ చేనులోని పత్తి పంట మధ్యలో 50 గంజాయి మొక్కలను నాటారు.పక్కా సమాచారం మేరకు పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సునీల్ తెలిపారు.