డ్రోన్లతో విప్లవాత్మక మార్పులు
NEWS Aug 28,2024 06:11 am
డ్రోన్ సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు రావచ్చని అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ మహేష్ తెలిపారు. అమలాపురం కలెక్టరేట్‌లో డ్రోన్ సాంకేతికతపై జిల్లాలోని సర్వేయర్స్‌కి శిక్షణా తరగతులు నిర్వహించారు. డ్రోన్ సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని పేర్కొన్నారు. పంట పొలాల్లో పురుగులు, ఎరువులు పిచికారి చేయవచ్చునని తెలిపారు.