కాకినాడ జిల్లా సామర్లకోట రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న రావిచెట్టు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాధారణంగా రావి చెట్టును ఎక్కడ ఉన్నా పూజిస్తారు. వినాయకుడు ఆకారంలో రావిచెట్టు మొదలు దానికదే సహజంగా ఏర్పడి పూజాలు చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. దీంతో పలువురు పరిసర ప్రాంత ప్రజలు చెట్టును సందర్శించి వెళ్తున్నారని చెబుతున్నారు.