గిరిజన ప్రాంతంలో అల్లం ధర ఒక్కసారిగా పడిపోయింది. గత వారం మార్కెట్లో కిలో రూ.60 నుంచి 70ధరకు వర్తకులు కొనుగోలు చేశారు. ఈ వారం లోతుగెడ్డ వారపు సంతలో వర్తకులు కిలో రూ.40 ధరకు కొనుగోలు చేశారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏడాది గిరిజన రైతులు ఆగస్టులో పాత అల్లం పొలాల నుంచి తీసుకుని మార్కెట్లో విక్రయిస్తారు. ఒక్కసారిగా ధర పడిపోవడంతో గిట్టుబాటు కావడం లేదని రైతులు అదన వ్యక్తం చేస్తున్నారు.