ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి
NEWS Aug 28,2024 06:13 am
గణపతి నవరాత్రి ఉత్సవ మండపాల ఏర్పాటుకు నిబంధనలను ఆయా కమిటీలు తప్పక పాటించాలని తూ.గో జిల్లా ఎస్పీ డి.నరసింహకిషోర్ తెలిపారు. సింగిల్ విండో సిస్టంతో అర్బన్ పరిధిలో కార్పొరేషన్ కార్యాలయం నుంచి, రూరల్ పరిధిలో తహశీల్దారు కార్యాలయం నుంచి మండపాల ఏర్పాటుకు అనుమతులు తీసుకోవాలని సూచించారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని లేనియెడల చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.