సుద్దగడ్డకు కొనసాగుతున్న వరద ఉధృతి
NEWS Aug 28,2024 01:35 pm
గొల్లప్రోలులో ఉన్న సుద్దగడ్డకు కాలువకు వరద ఉధృతి కొనసాగుతున్నది. దీంతో స్థానిక జగనన్న కాలనీకి వెళ్లే రహదారి పై మంగళవారం సుమారు ఐదు అడుగుల ఎత్తున వరద నీరు ప్రవహించింది. దీంతో అటుగా వెళ్లే ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. వర్షాలు కురవనప్పటికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఉధృతి తగ్గడం లేదు. కాలనీకి పూర్తిస్థాయిలో తాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.