మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరిపై కేసు
NEWS Aug 30,2024 03:05 pm
మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఇద్దరిపై కేసులు నమోదు చేశామని ద్రాక్షారామ ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. రామచంద్రపురం మండలం వేగాయమ్మపేట గ్రామంలో తనిఖీలు నిర్వహించగా మండపేటకు చెందిన కిషోర్, రాజమహేంద్రవరానికి చెందిన జాన్ మద్యం తాగి వేరు వాహనాలు నడుపుతుండగా వారిపై కేసులు నమోదు చేశామన్నారు. ద్వారపూడికి చెందిన దుర్గాప్రసాద్ మద్యం సీసాలు తీసుకొస్తుండగా వాటిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు