ఐటీఐలో ప్రవేశానికి ఇంటర్వ్యూలు
NEWS Aug 28,2024 06:14 am
కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు మూడో విడత దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 29వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్ ఎం.వేణుగోపాలవర్మ తెలిపారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. మౌఖిక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాలని సూచించారు.