విద్యాసంస్థల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి
NEWS Aug 28,2024 05:58 pm
పెద్దాపురం మండలం దివిలి, చదలాడ గ్రామాలలో నెలరోజులలో ముగ్గురు విద్యార్థులు అనారోగ్య కారణాలతో మృతి చెందారని, తక్షణమే ప్రతీ పాఠశాలలోనూ వైద్య శిబిరాలు నిర్వహించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ బృందం ఆయా గ్రామాలను సందర్శించింది. పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలను సేకరించారు.