సీజనల్ వ్యాధులపై కీలక నిర్ణయం
NEWS Aug 28,2024 03:25 am
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు సంబంధిత శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. డెంగ్యూ, చికున్ గున్యా, వైరల్ జ్వరాలతో పెరుగుతున్నాయని.. వ్యాధులు ప్రబలకుండా తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్, స్ప్రేయింగ్ ముమ్మరం చేయాలని ఆదేశించారు.