హెల్మెట్ పై అవగాహన కల్పించేందుకు ఆర్టీఏ అధికారులు వినూత్న పద్ధతిలో ప్రచారం చేస్తున్నారు. రవాణా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ పోస్టర్ ఎంతగానో ఆలోచన రేకెత్తిస్తోంది. వినాయక చవితిని దృష్టిలో పెట్టుకొని వాహనదారులకు ఆ గణేశుడిని గుర్తు చేస్తూ.. ఆర్టీఏ అధికారులు పోస్టర్ ఏర్పాటు చేశారు. అందులో తల మీదే రక్షణ మీదే - ఒక తలపోతే రెండో తల పొందలేరు నాలాగ.. అంటూ ఆ లంబోదరుడే హెచ్చరిస్తున్నట్టు పోస్టర్‌లో రూపొందించారు.