వర్షం నీటితో స్థానికులు తీవ్ర ఇబ్బందులు
NEWS Aug 25,2024 08:03 am
కాట్రేనికోన పంచాయతీలోని 1వ వార్డులో ముంపు నీరు భారీగా నిలిచిపోయింది. వర్షం నీటితో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నివాస గృహాల చుట్టూ వర్షం నీరు చేరడంతో దోమలు పెరిగిపోయాయంటూ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వాపోతున్నారు. 3 రోజుల నుంచి ముంపు నీటి సమస్య తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే వార్డులో వారపు సంత, డైలీ మార్కెట్ ఉన్నాయి. అక్కడికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు.