ఐడియా ఇవ్వండి.. లక్ష గెలుచుకోండి
NEWS Aug 19,2024 06:35 am
తెలంగాణ ప్రభుత్వానికి పట్టణాలతో పాటు గ్రామాల నుంచి ఆదాయం సృష్టించే ఇన్నోవేషన్ ఐడియాలను.. నెటిజన్ల నుంచి ఆహ్వానించారు ఫైనాన్స్ కమిషన్ మెంబర్ స్మితా సబర్వాల్. తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఆధ్వర్యంలో ఐడియాథాన్ పేరుతో ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వం అమలు చేసే విధానాలతో పాటు.. నెటిజన్లు, సీనియర్ సిటిజన్లు, మాజీ అధికారులు ఇలా ఎవరైనా ప్రభుత్వానికి ఆదాయం సృష్టించే మార్గాల గురించి ఐడియా ఇవ్వాలని కోరారు. మంచి ఐడియా ఇస్తే.. అందుకు రివార్డుగా లక్ష రూపాయలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.