‘బాహుబలి’ని శిఖర స్థాయిలో నిలబెట్టే మహోన్నత ఆలోచన
ఏడేళ్ల క్రితమే విక్రమ్ నారాయణ రావు గారి ఐడియాలజీకి హ్యాట్సాప్!
NEWS Oct 18,2025 06:29 pm
ఒక చక్కని ఆలోచన సంచలనాలు సృష్టిస్తుంది..
ఒక సరైన విజన్ విజయ తీరాలకు తీసుకెళుతుంది..
ఒక ముందుచూపు అద్భుతాలు ఆవిష్కరిస్తుంది..
ఒక మార్గదర్శి జీవన గమనాన్ని నిర్దేశిస్తుంది..
అలాంటి మహోన్నతమైన ఆలోచనలు విక్రమ్ నారాయణ రావు గారి సొంతం. అనితర విజయాలు సాధించిన పారిశ్రామికవెత్త విక్రం నారాయణ రావు గారి ఐడియాలజీ వెనుక ఎన్నో అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. అందులో ప్రస్తుతం ప్రధానంగా చెప్పుకోదగినది ‘బాహుబలి’ ప్రాజెక్టుకు సంబంధించి ముందుచూపు ఆలోచన ప్రకటించి అందరి చూపు తనవైపు తిప్పుకుంటున్నారు.
ఇండియన్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి గారు తెరకెక్కించిన ‘బాహుబలి’ ప్రాజెక్టుకు సంబంధించి రెండు భాగాలను కలిపి ఒకే సినిమా రూపంలో ‘బాహుబలి: ది ఎపిక్’ (Baahubali The Epic 2025) పేరుతో అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.
అయితే ఈ ఆలోచనల ఏడేళ్ల క్రితమే లాయిడ్ గ్రూప్స్ అధినేత, ధనిక భారత్ విజన్ సృష్టి కర్త విక్రం నారాయణ రావు గారు సూచించారు. 2017 మే 6న ఆయన ట్విట్టర్‌లో రాజమౌళిని ట్యాగ్ చేస్తూ – “బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 కలిపి ఒకే సినిమాలా రిలీజ్ చేయండి. ఇది ఇప్పటి వరకు సినిమా చరిత్రలో జరగని అద్భుతం అవుతుంది. కనీసం 500 కోట్ల రూపాయల వసూళ్లు సాధించే అవకాశం ఉంది. అలాగే ప్రేక్షకులకు మరో మాయాజాలమైన అనుభవం ఇవ్వవచ్చు” అని సూచించారు. ‘బాహుబలి 2’ విడుదలైన వారం రోజులకే విక్రం నారాయణ రావు గారు ఈ పోస్టు చేశారు. పదేళ్ల తర్వాత ఆ ఆలోచనను రాజమౌళి నిజం చేస్తుండటంతో, విక్రం నారాయణ రావు గారు ఏడేళ్ల క్రితమే చేసిన ఈ ఆలోచనపై పలువురు అభినందిస్తున్నారు. అటు వ్యాపార రంగంలోనే కాదు ఇటు సినిమా రంగంలోనూ విజన్ ఉన్న లీడర్‌గా విక్రం నారాయణ రావు గారిపై అన్ని వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.