టిప్పర్ దొంగలించిన ముఠా అరెస్ట్
NEWS Oct 18,2025 03:40 pm
రాజమహేంద్రవరం: రాజమండ్రి పరిధిలో టిప్పర్ లారీని దొంగిలించిన ముఠాను ట్టుకున్నట్లు రాజమండ్రి నార్త్ జోన్ డీఎస్పీ వై. శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు ఆయన రాజానగరం లో మీడియాతో మాట్లాడుతూ.. గత నెల 28న మన్యం గణేశ్వరరావుకు చెందిన టిప్పర్ అపహరణకు గురవగా, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేశారు. ఈ కేసులో రాజస్థానుకు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు.