ఉద్యోగస్తులకు అవార్డుల ప్రధానోత్సవం
NEWS Aug 18,2024 06:34 am
అమలాపురంలో 78వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా డివిజనల్ పంచాయతీ అధికారి బొజ్జిరాజు అధ్యక్షతన జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన పంచాయతీ ఉద్యోగస్తులకు అవార్డులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా పంచాయతీ అధికారి డి .రాంబాబు మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతో ప్రధానమైనదని, ముఖ్యంగా గ్రామపంచాయతీలు పాత్ర కీలకంగా ఉంటుందన్నారు.