సమష్టి కృషితో భారత్ సమ్మిట్ 2.0
NEWS Nov 15,2026 11:57 am
HYD: భారత్ సమ్మిట్ 2.0 నిర్వహణకు సంబంధిం చిన తెరవెనుక ఏర్పాట్లు, సమన్వయం,నిర్విరామ కృషిని తెలియజేస్తూ IOC UK వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ గౌడ్ ప్రత్యేకంగా స్పందించారు. ఒక కార్య క్రమం విజయవంతం కావడం వెనుక ఎంతోమంది శ్రమ, అంకితభావం, సమష్టి కృషి ఉంటాయని పేర్కొన్నారు. సమ్మిట్‌కు సంబంధించిన ఏర్పాట్ల నుంచి వివిధ విభాగాల మధ్య సమన్వయం వరకు ఎన్నో అంశాల్లో నిర్వాహకులు కష్టపడ్డారని తెలిపారు. భారత్ సమ్మిట్ 2.0 విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.